Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాధూ తులాపూర్ » వాతావరణం

వాధూ తులాపూర్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయంతక్కువ వర్షాలు పడే వర్షాకాలంలో తప్ప, ఏడాదిలో ఎక్కువ భాగం ఇక్కడి వాతావరణం పొడిగా, వేడిగా వుంటుంది. శీతాకాలంలో ఇక్కడికి రావడం చాలా ఉత్తమం.

వేసవి

వేసవిమార్చ్, ఏప్రిల్, మే మూడు నెలల్లో వాధూ, తులాపూర్ లలో వేసవి నడుస్తుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41డిగ్రీల దాకా వుంటాయి. ఈ కాలంలో ఇక్కడికి ప్రయాణం చేయడం చాలా అసౌకర్యంగా వుంటుంది – అందువల్ల ఇక్కడికి ఆ కాలంలో రారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత భరించ గలిగేలా 22 డిగ్రీలకు పడిపోతుంది.

వర్షాకాలం

వర్షాకాలంవాధూ – తులాపూర్ లలో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వుంటుంది. ఈ రెండు గ్రామాల్లో పరిమిత వర్ష౦ పడుతుంది. ఈ కాలం వేసవితో పోలిస్తే వాధూ – తులాపూర్ సందర్శనకు మరింత మెరుగైన సమయం.వర్షాకాలం తర్వాత వచ్చే అక్టోబర్ – నవంబర్ నెలలు ఈ యాత్రా స్థలాన్ని ఆస్వాదించడానికి బాగుంటాయి.

చలికాలం

శీతాకాలండిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల పాటు ఇక్కడ శీతాకాలం వుంటుంది.శీతాకాలంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 25 డిగ్రీలు, కనిష్టంగా 8 డిగ్రీలు వుంటాయి. డిసెంబర్ అన్నిటికన్నా చల్లగా వుండే నెల.