ఇది అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్ సెంటర్ సెంటర్ మరియు వైజాగ్ లో ఉన్న వినోద ప్రదేశాలలో ఒకటి. షాపింగ్ సెంటర్ దగ్గరగా జగదంబ సినిమా థియేటర్ ఉంది.జగదాంబ 70 ఎమ్. ఎమ్. థియేటర్ కట్టిన తరువాత, ఈ ప్రాంతం అంతా వ్యాపార పరంగా అభివృద్ధి చెంది, విశాఖపట్నం అంటే, జగదాంబ సెంటరు ఆందరికీ గుర్తు వస్తుంది. అర్.టి.సి. కాంప్లెక్స్ కట్టేవరకు, విశాఖపట్నం జగదాంబ సెంటర్ వరకే వుండేది.పర్యాటకులు ఖాళీ సమయాల్లో తిరగటానికి మాల్స్,రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయి.