భారతదేశం అంతటా కట్టిన ఎనిమిది శాంతి స్తూపాలలో విశ్వ శాంతి స్తూపం ఒకటి. ఇది గీతై మందిరం పక్కనే ఉంది. ఇది గాంధీజీచే ప్రేమగా ఫుజీ గురూజీ గా పిలువబడే గురువుగారి కల. 1935 లో జపాన్ నుండి ఇటువంటి స్తూపాలు కట్టె ఉద్దేశ్యంతో ఫుజీ గురూజీ గాంధీని కలవడానికి భారతదేశం వచ్చారు.ఈ స్తూప౦ బౌద్ధులకు ప్రార్ధనా మందిర౦గా ఉపయోగపడుతోంది. తెల్లగా, పెద్దగా ఉండి, పై భాగాన నాలుగు బుద్ధ విగ్రహాలు నాలుగు దిక్కులను చూస్తూ ఉంటాయి. ఈ స్తూప౦ గౌతమ బుద్ధుని జీవిత చరిత్రని వివరిస్తుంది.ఈ ప్రాంత పరిసరాలలో, ఒక పెద్ద పార్క్, పక్కన జపనీయుల చిన్న బుద్ధ దేవాలయం కూడ ఉంది.



Click it and Unblock the Notifications