Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యల్లాపూర్ » వాతావరణం

యల్లాపూర్ వాతావరణం

యల్లాపూర్ వాతావరణం వర్షాకాలం తర్వాత అక్టోబర్ మరియు నవంబర్ నెలలు ఈ ప్రాంత సందర్శనకు ఆహ్లాదకరంగా ఉంటాయి.

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - ఈ కాలంలో యల్లాపూర్ వాతావరణం ఒక మోస్తరు వేడి కలిగి అసౌకర్యంగానే ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగాను కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రివేళ 22 డిగ్రీలుగాను ఉంటాయి. వేసవిలో ప్రత్యేకించి ఏప్రిల్ మరియు మే నెలలలో యాత్రికులు వేడి కారణంగా ఈ ప్రాంత సందర్శనకు రారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - యల్లాపూర్ వర్షాకాలంలో అధిక వర్షాలను పొందుతుంది. పర్యాటకులకు పర్యటించేందుకు అసౌకర్యం. ఉష్ణోగ్రతలు తక్కువే అయినప్పటికి ప్రదేశాల సందర్శన కష్టం కనుక సందర్శనకు అనుకూలం కాదు.   

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో యల్లాపూర్ కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలుగాను, గరిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలుగాను ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంత పర్యటనకు ఇది అనుకూలమైన సమయం.