Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» యుస్మార్గ్

యుస్మార్గ్ - ప్రకృతి అందాలు !

6

బుడ్గాం జిల్లాలో శ్రీనగర్ కి 50 కిలో మీటర్ల దూరం లో ఉన్న "యుస్మార్గ్" ప్రక్రుతి అందాలకి ప్రసిద్ధి. పిర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 7500 అడుగుల ఎత్తులో ఈ గ్రామం ఉంది. పచ్చిక బయళ్ళు,,పర్వత శిఖరాలు,లోయలతో నిండి ఉన్న యుస్మార్గ్ యాత్రికులకి కనువిందు చేస్తుంది. యాత్రికులు ఇక్కడ "ట్రెక్కింగ్","స్కీయింగ్","పోనీ రైడింగ్" చెయ్యవచ్చు. యుస్మార్గ్ కి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న "నీల్నాగ్" నుండి ట్రెక్కింగ్ మొదలు పెడతారు.

"నీల్ నాగ్ సరస్సు","తాటకుతి పర్వతం" మరియు "సంగ్-యే-సఫెద్" యుస్మార్గ్ లో గల ఇతర ఆకర్షణలు. నీలి రంగు నీటితో నిండి ఉన్న "నీల్ నాగ్" సరస్సు మంచి పిక్నిక్ స్థలంగా కూడా ప్రసిద్ధి. సముద్ర మట్టానికి 15500 అడుగుల ఎత్తు లో ఉన్న "తాటకుతి" పర్వతాన్ని యుస్మార్ నుండి కాలినడక ద్వారా లేదా గుర్రాల మీద చేరుకోవచ్చు. అండాకారంలో ఉన్న "సంగ్-యే-సఫెద్" ఒక పచ్చిక మైదానము. ఇది కూడా మంచి పిక్నిక్ స్థావరమే. ఇక్కడకి వచ్చేటప్పుడే యాత్రికులు అందమైన పచ్చిక మైదానాలైన "హైగిన్" మరియు "లిద్దెర్మర్" లని కూడా చూడవచ్చు.

యుస్మార్గ్ కి రైలు,రోడ్డు, వాయు మార్గాలలో దేనిని ఉపయోగించి అయినా చేరుకోవచ్చు. శ్రీనగర్ విమాన స్థావరం యుస్మార్గ్ కి అతి దగ్గరలో ఉంది . "షింలా",'ఢిల్లీ","చండీఘర్","ముంబై" వంటి భారత దేశ ముఖ్య నగరాలతో శ్రీ నగర్ అనుసంధానించబడింది. ఢిల్లీ లో గల ఇందిరా గాంధీ విమానాశ్రయం యుస్మార్గ్ కి దగ్గరలో గల విమానాశ్రయం. జమ్ము తావి రైల్వే స్టేషన్ యుస్మార్ కి దగ్గరలో గల రైల్వే స్టేషన్. శ్రీనగర్ నుండి డైరెక్ట్ బస్సులు యుస్మార్గ్ కి తరచుగా తిరుగుతాయి.

యుస్మార్గ్ లో వాతావరణం శీతోష్ణ మండలాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ వేసవి ఆహ్లాదంగా ఉండి శీతాకాలం లో కాస్త మంచు కురుస్తుంది. యుస్మార్గ్ కి సందర్సించటానికి వేసవి కాలమైన మే-ఆగస్టు మధ్య కాలం అనువైనది. శీతాకాలమైతే అక్టోబర్-మార్చ్ మధ్య దర్శించవచ్చు.

యుస్మార్గ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

యుస్మార్గ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం యుస్మార్గ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? యుస్మార్గ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం యుస్మార్గ్ కి 47 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీ నగర్ నుండి యుస్మార్గ్ చేరుకోవడానికి బస్సులు సులభంగా దొరుకుతాయి.యాత్రికులు ఢిల్లీ,జమ్ము,చండీఘర్,లేహ్,పహల్గాం నుండి బస్సుల ద్వార శ్రీ నగర్ చేరుకుని అక్కడ నుండి యుస్మార్గ్ చేరుకోవచ్చు. సహేతుకమైన ధరలతో జమ్ము కాశ్మీరు రోడ్డు రవాణా సంస్థ బస్సులు శ్రీ నగర్ నుండి యాత్రికులని సౌకర్యవంతంగా యుస్మార్గ్ చేరుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గము:జమ్ము లో గల జమ్ము తావి రైల్వే స్టేషన్ యుస్మార్ కి దగ్గర లో గల రైల్వే స్టేషన్.బెంగళూరు,చెన్నై,ఢిల్లీ వంతి ఇతర ముఖ్య నగరాలతో జమ్ము తావి అనుసంధానించబడినది. ఇక్కడి నుండి యాత్రికులు ట్యాక్సీలు లేదా బస్సులు అద్దెకు తీసుకుని యుస్మార్గ్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం:శ్రీనగర్ లో గల "షేక్ ఉల్ అలాం" విమానాస్థావరం యుస్మార్గ్ కి దగ్గరలో ఉంది ."షింలా",'ఢిల్లీ","చండీఘర్","ముంబై" వంటి భారత దెశ ముఖ్య నగరాలతో శ్రీ నగర్ విమాన స్థావరం అనుసంధానించబడింది. ఢిల్లీ లో గల ఇందిరా గాంధీ విమానాశ్రయం యుస్మార్గ్ కి దగ్గర లో గల విమానాశ్రయం. ఇది శ్రీ నగర్ నుండి 876 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న యాత్రికులు ట్యాక్సీలు లేదా బస్సులు అద్దెకు తీసుకుని యుస్మార్గ్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu