Search
  • Follow NativePlanet
Share
» »కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం !!

కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం !!

ఈ గుడి సరస్సు లో ఒక మొసలి ఉంటుంది. ఈ మొసలి దేవాలయాన్ని రక్షిస్తుందని చెపుతారు. ఈ మొసలి చచ్చి పోతే మరొకటి దాని స్థానం లో రహస్యంగా వచ్చేస్తుందని చెపుతారు.

By Mohammad

కేరళ లోని ఉత్తర దిశలో చివరగా వున్నా కాసర్గోడ్ జిల్లా చాలా మందికి చారిత్రక మరియు పురావస్తు అంశాల ఆసక్తి కలిగిస్తుంది. కేరళ ప్రదేశానికి అరబ్బులు క్రీ.శ. 9 వ మరియు క్రీ.శ. 14వ శతాబ్దాలలో కాసర్గోడ్ ద్వారా వచ్చారని చెపుతారు. కాసర్గోడ్ లో కల బెకాల్ కోట ఒక విలువైన చారిత్రక చిహ్నం. దక్షిణ దిశగా అది నేరుగా సముద్రం లోకి వుంటుంది.

'కాసార' అంటే సంస్కృతి అని మరియు 'క్రోద' అంటే భద్రత కల ఒక ధనాగారం అని చెపుతారు. కాసర్గోడ్ ప్రధానంగా కాసారక చెట్లచే నిండి వుంటుంది. కనుక ఈ ప్రదేశానికి ఈ పేరు ఆ చెట్ల వలన కూడా వచ్చిందని చెప్పవచ్చు. కాసర్గోడ్ ప్రాంతం లో అధికంగా కొబ్బరి మరియు తాటి చెట్లు, కొండల మీద నుండి సముద్రంలోకి ప్రవహించే నీటి ప్రవాహాలు కనపడతాయి.

కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం !!

చిత్రకృప : Vinayaraj

అనంతపుర ఆలయం

కేరళలో ఈ గుడి మాత్రమే సరస్సు కల దేవాలయం. స్థానికులు దీనిని అనంత పద్మనాభ స్వామి మూల స్థానం గా చెపుతారు. ఈ గుడి సరస్సు లో ఒక మొసలి ఉంటుంది. ఈ మొసలి దేవాలయాన్ని రక్షిస్తుందని చెపుతారు. ఈ మొసలి చచ్చి పోతే మరొకటి దాని స్థానం లో రహస్యంగా వచ్చేస్తుందని చెపుతారు.

అనంతపుర దేవాలయాని 9 వ శతాబ్దంలో నిర్మించారు. ఇది బెకాల్ కు 30 కి.మీ. ల దూరం లో కలదు. ఈ దేవాలయాన్ని కుల మత ప్రసక్తి లేకుండా అందరూ దర్శిస్తారు. ఈ దేవాలయ ప్రాకారం సుమారు 302 చ.అడుగులు అంటే రెండు ఎకరాలుగా ఉంటుంది.

కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం !!

చిత్రకృప : Santhoshslpuram

గోవింద పాయి మెమోరియల్

గోవిందా పాయి ఇక్కడ పుట్టిపెరిగిన కన్నడ కవి. అయన జ్ఞాపకార్థం ఒక భవనాన్ని ఏర్పాటు చేసి అయన పేరు పెట్టారు. ఈ మెమోరియల్ ను ఆయన జన్మించిన మంజేశ్వర్ లో నిర్మించారు. అనేకమంది కవులు, పర్యాటకులు ఈ ప్రదేశాన్ని, మెమోరియల్ ను సందర్శిస్తారు.

ముదియాన్ కులం టెంపుల్

కాసరోడ్ సమీపం లోని హోసదుర్గ లో కల మదియాన్ కులం టెంపుల్ ఆ గుడి లోని దేవత భద్రకాళి ప్రధాన దేవతగా కలదు. హాస దుర్గ తాలూక లోని కన్హన్గడ్ ప్రధాన కార్యాలయానికి 5 కి.మీ.ల దూరం లో ఈ గుడి కలదు.

కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం !!

చిత్రకృప : Syed naqhib barid

ఇది కేరళ రాష్ట్ర ఉత్తర చివరి భాగం. మదియాన్ కులం టెంపుల్ లో ప్రధాన దేవత భద్ర కాలి అయినప్పటికీ, ఇంకా భగవతి, క్షేత్రపాలన్, మరియు, భైరవన్ వంటి ఇతర దేవతలను కూడా ఇక్కడ పూజిస్తారు. ఈ గుడి ప్రత్యేకత అంటే బ్రాహ్మణ పూజారి పూజ ను మధ్యానం వేళా నిర్వహిస్తారు. ఇతర హిందువులైన మనియానిలు పూజ ని ఉదయం , సాయంకాలం చేస్తూ ఉంటారు.

మాలిక్ దీనార్ మసీదు

కాసర్గోడ్ లో ఇస్లాం మాత ఆవిర్భావానికి ఇది చిహ్నం. ఇండియాలో మొదట సారి ఇస్లాం మతాన్ని మాలిక్ ఇబిన్ దీనార్ తీసుకువచ్చినట్లు చెబుతారు. ఈ యాత్రా స్థలం ముస్లిం వారికే కాక విదేశాల్లో ఉన్న ముస్లిం వారికి కూడా ప్రసిద్ధిచెందినది. మసీదు శైలి ఇస్లాం శైలిలో కాకుండా కేరళ సాంప్రదాయ శైలిలో ఉండటం ప్రత్యేకత. ప్రతి సంవత్సరం మసీదులో ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. శిల్పశైలి, చరిత్ర, సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ మసీదును చూడవచ్చు.

కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం !!

చిత్రకృప : Hari Prasad Nadig

కాసర్గోడ్ లో చూడవలసిన ఇతర ప్రదేశాలు : స్యాంక్చురీలు, బేల్ చర్చి, మాథుర్ గణపతి ఆలయం, మల్లికార్జున ఆలయం, త్రిక్కనాడ్ ఆలయం, బెకాల్ కోట మొదలగునవి చూడవచ్చు.

వసతి : కాసర్గోడ్ లో వసతి సదుపాయాలు కలవు. అన్ని తరగతుల వారికి బస లభిస్తుంది. నామమాత్రధరల్లోనే గదులు దొరుకుతాయి. స్థానిక వంటలు రుచి చూడవచ్చు.

కాసర్గోడ్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

కాసర్గోడ్ కు సమీపాన ఉన్న 50 కి. మీ. దూరంలో మంగళూరు విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

ప్రకృతి దృశ్యాలతో నిండిన కాసర్గోడ్ ను చూడాలంటే రైలు ప్రయాణం ఉత్తమం. దీనికి సమీపాన అదూర్ రైల్వే స్టేషన్ (25 కి.మీ దూరంలో) , ఎర్నకులం రైల్వే స్టేషన్ (125 కి.మీ దూరంలో) కలదు. ఈ రెండు రైల్వే స్టేషన్ లు దేశంలోని ప్రధాన నగరాలతో కలుపబడి ఉన్నది.

రోడ్డు మార్గం

కాసర్గోడ్ కు బస్సు ప్రయాణం చవకైనది. దారి పొడవునా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. మంగళూరు, ఎర్నాకులం, బెకాల్, అదూర్ ప్రాంతాల నుండి తరచూ ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X