అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

అమృతసర్ స్వర్ణ దేవాలయ దర్శనం !

Posted by:
Updated: Friday, October 16, 2015, 9:42 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

అమ్రిత్సర్ కు ఆ పేరు గోల్డెన్ టెంపుల్ కల అక్కడి పవిత్ర సరోవరం నుండి వచ్చింది. అమ్రిత్సర్ స్వర్ణ దేవాలయం సిక్కుల పుణ్యక్షేత్రం. ప్రతి రోజూ వేలాది సిక్కు మత ప్రజలు ఇక్కడకు వచ్చి తమ ప్రార్ధనలు చేసుకుని వెళతారు. సందర్శకులు, లేదా పర్యాటకులు సరస్సు మధ్యలో నిర్మించిన ఈ దేవాలయ వైభవం చూసేందుకు వస్తారు.

అమ్రిత్సర్ పట్టణంలో స్వర్ణ దేవాలయం మాత్రమే కాక, ఇంకనూ అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. జిల్లియన్ వాలా బాగ్ మాతా టెంపుల్, మహారాజా రంజిత్ సింగ్ వేసవి విడిది వంటివి ఎన్నో కలవు.

అమ్రిత్సర్ స్వర్ణ దేవాలయం విశాలమైనది. సిక్కు మతత్స్తుల చరిత్ర, సంస్కృతి తెలియ చేస్తుంది. ఈ గురుద్వారా ను శ్రీ హరమందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. గురుద్వారా లోని పై అంతస్తులను 400 కిలోల బంగారం తో నిర్మించారు. అందుకనే దీనిని గోల్డెన్ టెంపుల్ లేదా స్వర్ణ దేవాలయం అంటారు. దీనిలో 'గురు గ్రంధ సాహిబ్' అనబడే ఒక పవిత్ర గ్రంధం వుంటుంది. ఈ భవనానికి ఎదురుగా సిక్కు మత చరిత్రను తెలిపే ఒక మ్యూజియం కలదు.

హరమందిర్ సాహిబ్

హరమందిర్ సాహిబ్

హరమందిర్ సాహిబ్ ను గోల్డెన్ టెంపుల్ అంటారు. ఈ భావన పై అంతస్తులు బంగారం తో నిర్మించటం తో దీనికి ఈ పేరు వచ్చింది. ఈ దేవాలయం అమ్రిత్సర్ అనబడే సరోవరంలో తేలుతూ వుంటుంది. ఈ టెంపుల్ లో సిక్కుల పవిత్ర గ్రంధం అయిన ఆది గ్రంధం ఉంచుతారు. దీనిని ప్రతి రోజూ ఉదయం చదువుతారు. సరస్సు లోని ఒక వంతెన ద్వేఆరా దీనిని చేరాలి. సాంప్రదాయ దుస్తులు ధరించిన రక్షక భటులు దీనిని కావలి కాస్తూ వుంటారు.

Pic Credit: Wikki Commons

 

హరమందిర్ సాహిబ్

అమ్రిత్ సరోవర్
అమ్రిత్ సరోవర్ ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ సరస్సులో గోల్డెన్ టెంపుల్ కలదు. సిక్కుల నాల్గవ గురువు అయిన గురు రాం దాస్ అధ్వర్యంలో ఈ సరస్సు నిర్మించబడినది. ఈ పవిత్ర సరస్సు 'పవిత్ర నీరు' తో నింప బడినది అని చెపుతారు.

హరమందిర్ సాహిబ్

అకాల్ తక్త్
గురుద్వారా కి సరిగ్గా ఎదురుగా ఈ భవనం కలదు. అకాల్ తక్త్ అంటే సమయం లేనిది అని అర్ధం చెపుతారు. సిక్కుల ఉన్నత నిర్వహణా మండలి ఇక్కడ కూర్చుని టెంపుల్ కి సంబందించిన నిర్ణయాలు చేస్తుంది. గురు గ్రంధ సాహిబ్ గ్రంధాన్ని రాత్రులందు ఇక్కడ ఉంచుతారు.

Pic Credit: Giridhar Appaji Nag Y

హరమందిర్ సాహిబ్

సెంట్రల్ సిక్కు మ్యూజియం
విశాలమైన ఈ మ్యూజియం లో సిక్కుల చరిత్ర చిత్రాలు , గురువుల పెయింటింగ్ లు, సిక్కు మృత వీరుల చిత్రాలు మొదలైనవి ప్రదర్శిస్తారు. ఎంట్రీ ఉచితం.
Pic Credit: Wikki Commons

హరమందిర్ సాహిబ్

ఘంటా ఘర్
గురుద్వారా ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద విక్టోరియన్ క్లాక్ టవర్ కలదు. భక్తులు టెంపుల్ లోకి వెళ్ళే ముందు తమ పాదాలను ఇక్కడ కల ఒక నీటి మడుగు లో శుభ్రపరచు కుంటారు.

Pic Credit: Giridhar Appaji Nag Y

 

 

హరమందిర్ సాహిబ్

లంగార్
గురుద్వారా లోని డైనింగ్ హాల్ ను లంగార్ అంటారు. భోజనం అందరకూ ఉచితం. ఈ భవన్ ప్రవేశంలోనే భక్తులకు ప్లేట్ లు స్పూన్ లు అందిస్తారు. అవి తీసుకొని వారు లోపలి వెళ్లి నెల మీద కూర్చుని వుంటే, వంటల వారు పెద్ద పెద్ద పాత్రలతో కల ఆహార పదార్ధాలు అంటే చపాతీ, రొట్టె మొదలైనవి తెచ్చి వడ్డిస్తారు. ఈ కార్యంలో అన్ని రకాల వారూ పాల్గొంటారు. డైనింగ్ హాల్ లోకి చెప్పులతో ప్రవేశం అనుమతించరు.

Pic Credit: Connie Ma

 

 

హరమందిర్ సాహిబ్

బైశాఖి
బైశాఖి వేడుకలతో సిక్కులు కొత్త సంవత్సరం లోకి అడుగు పెడతారు. ఈ సమయంలో దేవాలయం పూర్తిగా లైట్ ల తో అలంకరిస్తారు.

Pic Credit: nevil zaveri

 

 

హరమందిర్ సాహిబ్

నిబంధనలు
సందర్శకులు ప్రదేశ పవిత్రతను కాపాడాలి. ఆవరణలోకి అడుగు పెట్టిన వెంటనే, చెప్పులు వదిలేయాలి. పదాలు అక్కడ కల నీటి మడుగులో శుభ్రం చేసుకోవాలి. పురుషులు, స్త్రీలు తలకు ఒక బట్ట ధరించాలి. తాగుడు, పొగ తాగుత, మాంసం తినుట టెంపుల్ లో నిషేదించ బడినది. టెంపుల్ లోపలి భాగాలలో ఫోటో గ్రాఫి అనుమతించరు.

Pic Credit: Wikki Commons

హరమందిర్ సాహిబ్

ఆసక్తి కర ఇతర అంశాలు
స్వర్ణ దేవాలయ ప్రార్ధన అనంతరం అమ్రిత్సర్ లో మరి కొన్ని ప్రదేశాలు చూడవచ్చు. అవి, జిల్ల్లియాన్ వాలా బాగ్ స్మారక ప్రదేశం. ఇక్కడ జరిగిన పోరాటంలో సిక్కుల బ్రిటిష్ వారితో పోరాడి బావి లోకి నెట్ట బడి మరణించారు.

Pic Credit: Stefan Krasowski

హరమందిర్ సాహిబ్

మాతా టెంపుల్ మరియు రామ తీర్థ్
మాతా టెంపుల్, హిందువుల గుడి. గర్భం కోరే మహిళలు ఈ టెంపుల్ తప్పక సందర్శించి మాత ఆశీస్సులు పొందుతారు.
గతంలో మహారాజా రంజిత్ సింగ్ వేసవి విడిదిగా ఉపయోగించిన భవనంలో నేడు ఆయిల్ పెయింటింగ్ లు, నాణెములు, ఆయుధాలు, సిక్కుల ఇతర స్మారక వస్తువులు ప్రదర్శిస్తున్నారు. చివరగా, సిటీ వెలుపల కల రామ తీర్థ్ చూడాలి. శ్రీ రాముడి కుమారులు ఇక్కడ జన్మ పొందిన ప్రదేశంగా దీనిని చెపుతారు. వాల్మీకి మహర్షి నివసించిన గుడిసె నేటికీ ఇక్కడ చూడవచ్చు. Pic Credit: Arian Zwegers

హరమందిర్ సాహిబ్

షాపింగ్ మరియు ఆహారాలు
ఇక్కడ మీరు సిక్కుల వస్తువులు అయిన ఖాన్ దాస్, కారా, కత్తులు, దాగార్లు, వంటివి టెంపుల్ బయటి షాపులలో
కొనుగోలు చేయవచ్చు. గురు నానక్ ఫోటోలు, టెంపుల్ ప్రార్ధనల సి డి లు కొనుగోలు చేయవచ్చు. పంజాబీ దుస్తులు, చెప్పులు వంటివి కూడా కొనవచ్చు. సమీపంలో కల లస్సి వాలా చౌక్ కు వెళ్లి చివరగా అద్భుత రుచికరమైన ఒక పంజాబీ లస్సి పానీయం తాగి ఆనందించండి.

అమ్రిత్సర్ ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

Pic Credit: itsreallyrobert

 

 

Please Wait while comments are loading...