Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆదిలాబాద్ » వాతావరణం

ఆదిలాబాద్ వాతావరణం

ఉత్తమ సీజన్ఆదిలాబాద్ సందర్శించడానికి అనువైన సమయం అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ నెలల్లో సందర్శన మరియు ప్రయాణం చేయటం కూడా సులభం. అయితే, ప్రయాణీకులకు సాయంత్రం మరియు రాత్రి వేళలో చలిగా ఉంటుంది .అందువల్ల పర్యాటకులు ఉన్ని దుస్తులు వెంట తెచ్చుకోవాలి.  

వేసవి

వేసవి కాలం వేసవి కాలంలో వాతావరణం ఎక్కువ తేమతో కూడిన వేడి మరియు పొడిగాను ఉంటుంది. సాదారణంగా మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్ లలో వేసవి కాలం ఉంటుంది. వీటిలో, మే మరియు జూన్ నెలల్లో అధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. ఈ సమయంలో సందర్శన అనుకూలముగా ఉండదు.  

వర్షాకాలం

వర్షా కాలం వర్షా కాలం జూలై మధ్యలో ప్రారంభమయి ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలల వరకూ కొనసాగుతుంది.ఆదిలాబాద్ లో అదిక వర్షపాతం, మరియు ఈ రైతులు నీటిపారుదల ప్రయోజనాల కోసం కాలువలు మరియు ఆనకట్టలపై ఆధారపడి ఉంటారు. ఉష్ణోగ్రత వర్షాకాలం లో తక్కువగా ఉండుట వల్ల ఉక్కగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలముఆదిలాబాద్ భారతదేశం యొక్క ఉత్తర దిశా నగరాలు వలె కాకుండా తేలికపాటి శీతాకాలం కలిగి ఉంది. శీతాకాలాలు సాధారణంగా నవంబర్ చివరలో ప్రారంభమై ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. వాతావరణ మధ్యాహ్నాలు వెచ్చగా ఉండటం మరియు సాయంత్రం చల్లగా ఉండి ఈ నెలల్లో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ రాత్రుళ్ళు చాలా చల్లగా ఉంటుంది.