Search
  • Follow NativePlanet
Share

అగుడా - కోతలు, బీచ్ ల నిలయం!

12

అగుడా కోట నిస్సందేహంగా భారతదేశంలో చక్కగా నిర్వహిస్తున్న వారసత్వ కట్టడాలలో ఒకటి. ఈ 17వ శతాబ్దపు కోట పోర్చుగీసు పాలకులు డచ్ మరియు మరాఠా పాలకుల దాడులనుండి తమను సంరక్షించుకోవటానికిగాను నిర్మించారు. వేలాది పర్యాటకులు ఈ కోట సందర్శనకు వస్తారు.  అగుడా కోట మరియు అక్కడి లైట్ హౌస్ మీకు చూపు తిప్పుకోలేని అరేబియా సముద్రపు అందాలను ఈ బీచ్ ఒడ్డునుండి చూపుతాయి.

ఇక్కడే ఒక ఫైవ్ స్టార్ రిసార్టు తాజ్ వివంటాగా పిలువబడేది కలదు. ఖర్చుకు వెనుకాడేవారు కాకుంటే, ఈ రిసార్టు అద్భుత సౌకర్యాలను, ఆనందాలను కలిగిస్తుంది. సెలవుల కొరకు మీరు వెళ్ళే ఫైవ్ స్టార్ హోటళ్ళను సైతం ఆహారం, అన్నిటికి అందుబాటుగా వుండటం లో మరపింపచేస్తుంది. 

అగుడా మరియు అగుడా బీచ్ లు పేరొందిన కండోలిం బీచ్ నుండి కొద్ది దూరంలోనే ఉన్నాయి. సాయంత్రం అయిందంటే చాలు అగుడా కోట చుట్టు పక్కల ప్రదేశం అంతా అనేక సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్ తో నిండి పోతుంది. ఎన్నో పరికరాలు, దుస్తులు, చేతి కళల వస్తువుల వంటివి అతి చౌకగా కొనుగోలు చేయవచ్చు.  

అగుడా కోట చేరాలంటే గోవాలోని అన్ని ప్రదేశాలనుండి తేలికగా చేరవచ్చు. కనుక ఈ ప్రాంతంలో మీరు బస చేయటం ఎంతో ఉపయోగకరం. అగుడా చేరేందుకు అద్దె కారు లేదా టాక్సీలు విమానాశ్రయం మరియు రైలు స్టేషన్ ల నుండి లభిస్తాయి. మీరు స్వంత డ్రైవింగ్ లో చేరాలనుకుంటే, మార్గాన్ని సూచించే బోర్డులు ప్రతి చోటా కనబడుతూనే ఉంటాయి.    

అగుడా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అగుడా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అగుడా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అగుడా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu