1992 సంవత్సరంలో మరణించిన శ్రీ ఆనంద రిషిజీ మహారాజ్ పేరుపై ఆనంద ధామ్ నిర్మించబడింది. ఆయన శిరాల్ చించోడి ప్రదేశంలో జన్మించారు. ఆధ్యాత్మిక విద్యను ఆయన శ్రీ రతన్ రిషిజి మహరాజ్ నుండి అతి చిన్న వయసైన 13 సంవత్సరాలకే అభ్యసించారు. శ్రీ ఆనంద మహారాజ్ ఎన్నో విద్యా సంస్ధలను మత సంస్ధలను అహ్మద్ నగర్ లో ప్రజలకొరకు స్ధాపించారు. ప్రేమ, సహనం, న్యాయబద్ధత వంటి సిద్ధాంతాలు ఆయన ప్రసంగాలలో ఉంటాయి. ఇవి ఎంతోమందికి వారి వ్యాధులు, గాయాలు నివారణ అయ్యేలా చేశాయి. ఆయన ఒక మంచి రచయిత. ఎన్నో మరాఠి మరియు హిందీ పత్రికలకు వ్యాసాలు వ్రాశారు.



Click it and Unblock the Notifications