అందమైన ఫరియా బాగ్ పేలస్ అహ్మద్ నగర్ వ్యవస్ధాపకుడు అహ్మద్ నిజాం షా కుమారుడు బుర్హాన్ షా జ్ఞాపకార్ధం నిర్మించారు. ఎంతో లేత వయసు అయిన ఏడు సంవత్సరాల వయసులోనే బుర్హాన్ షా తన తండ్రి మరణం తర్వాత 1508 సంవత్సరంలో సింహాసనం అధిరోహించి నిజాం షాహి వంశపాలన చేపట్టాడు. బుర్హాన్ షా తన తండ్రి వైరి అయిన విజయనగర రాజుతో సంధి చేసుకున్నాడు. అతడు తన పాలనలో బీజపూర్ రాజులతోను మరియు మొగలులతోను అనేక యుద్ధాలు చేశాడు. ఫరియా బాగ్ పేలస్ అష్టభుజి నిర్మాణంగా ఉంటుంది. పెద్ద హాలు ఒక డోమ్ రూపంలో ఉంటుంది. ఈ కట్టడాన్ని కొండరాళ్ళతో నిర్మించి బయటి వరుస ప్లాస్టరింగ్ చేశారు. నిజాం షాహి రాజులు ఈ పేలస్ ను ఒక వినోద స్ధలంగా ఉపయోగించారు. చెస్ ఆడేవారు. సమీప సరస్సులలో స్నానాలు చేసేవారు.



Click it and Unblock the Notifications