ముల్లా డ్యామ్ ముల్లా నది ఒడ్డున కలదు. దీనినే ధ్యానేశ్వర్ డ్యామ్ అని కూడా అంటారు. ఇది అహ్మద్ నగర్ జిల్లాలో రాహూరి తాలూకాలో కలదు. ఈ డ్యాము నీటి నిలువ సామర్ధ్యం 26 టిఎంసిలు ఉంటుంది. అహ్మద్ నగర్ పట్టణానికి సమీప గ్రామాలకు ఈ డ్యామునుండే తాగునీటి సరఫరా అవుతుంది. పఠాద్రి, నెవాసా, షేవ్ గాంవ్, రాహూరి తాలూకాల సాగునీటి అవసరాలకు కూడా ఈడ్యామ్ నీరే ఉపయోగిస్తారు. డ్యాము చుట్టుపట్ల ప్రాంతాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. బోటింగ్ సౌకర్యాలు కలవు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్భుతమైన పిక్ నిక్ ప్రదేశం.



Click it and Unblock the Notifications