దంపా వైల్డ్ లైఫ్ సంక్చురి ఐజవాల్ కు 130 కి. మీ. ల దూరంలో వుంటుంది. దీని విస్తీర్ణం సుమారు 550 చ. కి. మీ. లు వుంటుంది. వేసవులు చల్లగా, వింటర్ లు ఆహ్లాదంగా వుంటాయి. ఈ సంక్చురి సముద్ర మట్టానికి 200 మీటర్ల నుండి 800 మీటర్ల ఎత్తున వుంది ప్రకృతి దృశ్యాలు ఆనందిన్చేడిగా వుంటుంది.
ఈ సంక్చురి లో వివిధ రకాల మొక్కలు, జంతువులు వుంటాయి. ఇంకనూ వివిధ జాతుల తోటలు, వెదురు చెట్లు కూడా చూడవచ్చు.
పులి, రీసస్ కోతి, పెద్ద ఉడుత, హిల్లాక్ గిబ్బన్, లీఫ్ మంకీ, ఇండియన్ ఎలిఫెంట్, హిమాలయన్ బ్లాకు బేర్ చిరుత, బార్కింగ్ డీర్, ముళ్ళ పండి, గౌర్, స్లోత్ బేర్ , వైల్డ్ బోర్ వంటివి చూడవచ్చు. కొండ చిలువ, కొండ తాబేలు, బల్లులు, కింగ్ కోబ్రా లు కూడా కనపడతాయి. దంప సంక్చురి చేరాలంటే, ఐజవాల్ నుండి టూరిస్ట్ వెహికల్ లో చేరవచ్చు. ఈ ప్రదేశం నవంబర్ నుండి మార్చ్ వరకూ పర్యటనకు అనుకూలం.