మందిర్ మాత లాల్ దేవి అమ్రిత్సర్ లోని రాణి కా బాగ్ లో వుంది. ఇది 20 వ శతాబ్దపు మహిళా సెయింట్ మాట లాల్ దేవి అనే మహిళది. ఈమెను భక్తులు పూజ్య మాత జి అనే వారు. హిందువులకు నగరంలో ఎంతో ప్రధానమైన మందిర్ మాత లాల్ దేవి కట్రా లోని మాతా వైష్ణో దేవి గుడి ని పోలి ఎంతో అందంగా వుంటుంది. అధ్యాత్మికులకు ఈ టెంపుల్ సందర్సన సూచించ దగినది. మూల మూలల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి ఆధ్యాత్మిక చింతన చేస్తారు.
టెంపుల్ ప్రవేశం లో మీపాదాల మడమ మునిగే నీరు మార్గాలు, అద్దాల హాలు మార్గాలు, మెలికలు తిరిగే మార్గాలు, వుంటాయి. టెంపుల్ లోపల అనేక హిందూ దేవతల అంటే శివుడు, బ్రహ్మ, కాళి , సరస్వతి వంటి దేవుళ్ళ విగ్రహాలు వుంటాయి. అనేక గుళ్ళు కల ఈ క్షేత్రం సంతానం కోరే మహిళల కోరికలు తీరుస్తున్దంటారు. మదర్ ఇండియా గా చెప్పబడే ఈ టెంపుల్ టూరిస్టులకు తప్పక సూచించ దగినది.