సముద్ర మట్టానికి 3056 మీటర్ల ఎత్తులో ఉన్న గుర్సో బుగ్యల్ ఔలి నుండి 3 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశం వేసవి కాలంలో పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శృంగాకార మొక్కలు మరియు ఓక్ అడవులు ఉంటాయి. ఈ ప్రదేశమునకు జోషిమత్ నుండి రోప్వే ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రదేశము వద్ద ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు.
అందువల్ల పర్యాటకులు ప్రతి రోజు ఉదయం వెళ్లి సందర్శించి రాత్రికి ఔలి కి చేరుకోవాలి. అది మాత్రమే కాకుండా గుర్సో బుగ్యల్ నుండి ఒక కిలో మీటర్ దూరంలో చట్టర్కుండ్ అనే ఒక చిన్న సరస్సు ఉంది, దానిని కూడా సందర్శించవచ్చు. ఈ సరస్సు స్వచ్చమైన మరియు తియ్యటి నీటికి ప్రసిద్ధి చెందింది.



Click it and Unblock the Notifications