ఔలి లో సందర్శించే ప్రయాణికులకు స్కీయింగ్ తర్వాత ఇతర ప్రధాన కార్యక్రమం ట్రెక్కింగ్. ఎత్తైన హిమాలయ శ్రేణులలో ట్రెక్కింగ్ కు ఉత్తమమైన వాలును అందిస్తుంది. ట్రెక్కింగ్ మార్గాలు ఒకటి 3 కి. మీ.ల పొడవు ఉండి, మరియు ప్రయాణీకులు ఇక్కడ నుండి పరిసరాలను సంపూర్ణ దృశ్యాన్ని చూడవచ్చు. ఈ మార్గం సముద్ర మట్టానికి 2519 మీ.ల నుండి 3049 మీటర్ల వరకు ఎత్తులో ఉంది. ఈ మార్గంలో ఉన్న శిఖరాలలో అందమైన ప్రకృతి వీక్షణల తో పాటు ప్రసిద్ధ పర్వాతాలు నందా దేవి, కామెట్,మనా పర్వత్ మరియు దునాగిరి లను చూడవచ్చు .
ఔలి నుండి జోషిమత్ కు వెళ్ళే దారి మార్గంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ట్రెక్కింగ్ వాలు ఉంది. ఈ మార్గం ద్వారా ట్రెక్కింగ్ చేసి పర్యాటకులు నందా దేవి శిఖరం నుండి సూర్యోదయం యొక్క మంత్రముగ్ధమైన వీక్షణను చూడవచ్చు. గోర్సన్, తలి, కుయరి పాస్, ఖులర మరియు తపోవన్ వంటి ఇతర ప్రముఖ చిన్న ట్రెక్కింగ్ మార్గాలు ఔలి లో ఉన్నాయి.