Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరన్ » వాతావరణం

బరన్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం : ప్రయాణానికి సరైన సమయం: అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు బరన్ సందర్శనకు అనువైనది, ఎందుకంటే ఆ సమయంలో అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, సందర్శనకు అనువైనదిగా ఉంటుంది.

వేసవి

వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): మార్చ్ నెలలో మొదలయ్యే వేసవి జూన్ వరకూ ఉంటుంది. ఈ సమయంలో, ఇక్కడి వాతావరణం చాలా అసౌకర్యంగా, పొడిగా ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 45c, 20c గా నమోదుచేయబడి ఉంటాయి. ఈ సమయంలో బారన్ సందర్శనకు అనువైనది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): వర్షాకాలం జులై నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలంలో తేలికపాటి వర్షాల కారణంగా ఇక్కడి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గి ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు): బరన్ లో శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో, ఇక్కడి ప్రదేశం లోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 24C, 10C గా ఉంటాయి. ఈ కాలంలో ఇక్కడ చాలా పొడిగా ఉంటుంది, అందువల్ల ఊలు దుస్తులు తీసుకువెళ్ళడం మంచిది. బారన్ సందర్శనకు ఈ సమయం సరైనది.