భట్కల్ వాతావరణం - భట్కల్ సందర్శనకు ఆగస్టు నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలలో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు
. వేసవి (ఏప్రిల్ నుండి జూన్) - ఈ సమయంలో భట్కల్ లో ఉష్ణోగ్రతలు పగటిపూట 36 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా ఉంటాయి. పర్యాటకులు ఈ సమయంలో భట్కల్ సందర్శనకు ఇష్టపడరు.
వర్షాకాలం (జూలై నుండి అక్టోబర్) - భట్కల్ లో వర్షాలు ఒక మోస్తరుగా ఉంటాయి. కనుక పర్యాటకులు వర్షాకాలంలో కూడా ఈ పట్టణానికి వస్తారు.
శీతాకాలం (నవంబర్ నుండి మార్చి) - శీతాకాలంలో భట్కల్ లో ఉష్ణోగ్రతలు 15 నుండి 22 డిగ్రీల మధ్యకు పడిపోతాయి. కనుక భట్కల్ మరియు సమీప ప్రాంతాల సందర్శనకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.