బిలాస్ పూర్ కు రతన్ పూర్ 25 కి. మీ. ల దూరంలో నేషనల్ హై వే 200 పై కలదు. ఇక్కడ హై హై వంశానికి చెందినా తొమ్మిది అడుగుల ఎత్తు కల బాబా భైరవ్ నాథ్ క్షేత్ర పాల సింగ్ విగ్రహం ప్రవేశం లోనే చూడవచ్చు. ఇది ఒకప్పుడు ఛత్తీస్ ఘర్ కు రాజధాని గా వుండేది. దీనిని 11 వ శతాబ్దం లో రతన్ రాజ్ పూర్వీకులు స్థాపించారు. చివరకు స్వాతంత్రం వచ్చేటంత వరకూ బ్రిటిష్ వారు పాలించారు.
ఇక్కడ కల మహామాయ టెంపుల్ ప్రసిద్ధి గాంచినది. దీని సమీపం లోనే ఒక కొలను, దాని ఒడ్డున కొన్ని పురాతన టెంపుల్స్ కూడా కలవు. బుద్ధ మహాదేవ, రాత్నేస్వరి మహాదేవ టెంపుల్, లక్ష్మి టెంపుల్ లు కూడా రతన్ పూర్ లో కలవు. రేయ్ పూర్ నుండి బస్సు లో తేలికగా చేరవచ్చు.
బిమ్బాజి భోంస్లే అనే మరాఠా రాజు ఇక్కడి కొండపైన రాం టెక్ అనే టెంపుల్ నిర్మించాడు. పురాతన రతన్ పూర్ కోట ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. కోట మంచి స్థితి లో వుంది కనుక చరిత్రకారులకు ఆసక్తి కలిగిస్తుంది. గణేశ గేటు ఆకర్షణీయంగా వుంటుంది.
కోటలో గంగ - జమున నదుల విగ్రహాలే కాక కొన్ని పురాతన రాతి శిల్పాలను కూడా చూడవచ్చు. బ్రహ్మ, విష్ణు, సిత్చౌరై, జగర్నాత్ టెంపుల్స్ మరియు శివుడి డాన్స్ భంగిమ తో కూడిన విగ్రహం కూడా కోట లో ఆకర్షణలు. రతన్ పూర్ లో ఖుత ఘాట్ మరియు ఖుదియా డాం లు చూడవచ్చు.



Click it and Unblock the Notifications