Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బిలాస్ పూర్ » ఆకర్షణలు » తాల గ్రామ

తాల గ్రామ, బిలాస్ పూర్

2

తాల లేదా తల గ్రామ బిలాస్ పూర్ కు 25 కి. మీ. ల దూరం లో భోజ్ పూర్ - దగోరి రోడ్ పై కలదు. ఇక్కడ దేవో రాణి - జేతాని టెంపుల్ , సుమారు 5 వ శతాబ్దం నాటిది కలదు. ఈ గుడులు తవ్వకాలలో బయట పడ్డాయి. ఈ టెంపుల్స్ లో దేవా రాణి టెంపుల్ మాత్రమే మంచి స్థితి లో వుంది. తలగ్రం ను అమెరి కప గ్రామం అని కూడా అంటారు.

ఈ టెంపుల్ లో ఏడు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు తో అందమైన దేవత విగ్రహం ఒకటి ఎనిమిది టన్నుల బరువు కలిగి వుంటుంది. టెంపుల్ కంటే కూడా విగ్రహం ఎంతో ప్రసిద్ధి. కానీ నేటికి ఈ మాతకు ఏ దేవత పేరు పెట్టలేదు.

తాలగ్రం రుద్రా శివ కు ప్రసిద్ధి. తాలగ్రం గుండా మనియారి నది ప్రవహిస్తుంది. ఇక్కడకు రాయ్ పూర్ లో సమీప ఎయిర్ పోర్ట్ బిలాస్ పుర లో సమీప రైలు స్టేషన్ కలవు. మిగిలిన దూరం బస్సు లో ప్రయాణించాలి.

అచన్ కమార్ వైల్డ్ లైఫ్ సంక్చురి

బిలాస్ పూర్ లో పురావస్తు, మాత్ర ప్రదేసాలే కాక వైల్డ్ లైఫ్ కూడా కలదు. అనేక అడవులు, కొండలు, నదులు ఈ ప్రదేశం లో కలవు. చత్తీస్ ఘర్ లో అచన్ కమార్ వైల్డ్ లైఫ్ సంక్చురి ప్రసిద్ధి చెందినది.

ఈ సంక్చురి లో అనేక వన్య జంతువులు, చిరుతలు, బెంగాల్ టైగర్ లు, వైల్డ్ బైసన్ , చితాల్, చారాల హయన, కేనిస్ , స్లాత్ బేర్, దోల్, సాంబార్ డీర్, నీల్గాయ్, ఇండియన్ ఫోర్ హరన్ అన్తెలోప్ చింకారా వంటివి ఎన్నో కలవు. 1975 లో స్థాపించిన ఈ అచన్ కమార్ ఒక టైగర్ రిజర్వు కూడాను.

ఈ సంక్చురి విస్తీర్ణం సుమారు 600 చ. కి. మీ. లు. ఇది బిలాస్ పూర్ కు పడమట గా 55 కి. మీ. ల దూరం లో కలదు. వర్షాకాలం ఇక్కడకు ప్రవేశం లేదు. ఇది కన్హా - ఆచనకమార్ కారిడార్ లో కలదు. ఇక్కడ సాల్, సాజా, బీజా, బంబూ చెట్లు అధికంగా వుంటాయి.

ఈ సంక్చురి కి వెళ్ళే మార్గం లో ఘోన్గాపాని జలాశయం అనే డాం కలదు. డాం దృశ్యం మంత్ర ముగ్ధులను చేసిదే గా వుంటుంది. డాము వద్ద ఉండేందుకు వసతి లేదు. ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు సంక్చురి తర్వాత అచ్చన్ కమార్, కేఒంచి, లమిని లలో కలవు. లామ్ని వద్డకల గెస్ట్ హౌస్ బ్రిటిష్ కాలం నాటిది. ఈ గెస్ట్ హౌస్ ల నిర్వహణ బాగానే వుంటుంది.

ఇక్కడకు బెల్గాహ్నా సమీప రైలు స్టేషన్. బిలాస్ పూర్ స్టేషన్ కూడా సేవలు అందిస్తుంది. అద్దె కార్లు మాత్రమే కాక, బస్సు లు టూరిస్ట్ వాహనాలు కూడా సంక్చురి కి లభ్యంగా వుంటాయి. పర్యావరణ టూరిజం కు ఇది ఒక మంచి ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed