సిర్పూర్ - సంపద నగరం !

ఒక పురాతన నగరం అయిన సిర్పూర్ లేదా శిర్పూర్ ను సంపద నగరం అని కూడా పిలుస్తారు. దాని పురావస్తు కట్టడాల యొక్క గొప్ప సాంప్రదాయ మరియు సాంస్కృతిక వారసత్వం కొరకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మహానది నది ఒడ్డున ఉన్నది. రాయ్పూర్ నుండి 80km దూరంలో ఉన్నది.

సిర్పూర్ లో మరియు చుట్టూ పర్యాటక స్థలాలు

సిర్పూర్ లో సందర్శించటానికి అనేక స్మారక అద్భుతాలు ఉన్నాయి. భారతదేశంలో దేవాలయ నిర్మాణంలో అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటిగా ఉన్న లక్ష్మణ దేవాలయం ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణగా ఉన్నది.

పట్టణంలో ఇతర పర్యాటక ఆకర్షణలుగా ఆనంద్ ప్రభు కుడి విహార్, తుర్తురియ,బుద్ధ విహార్,రామ్ ఆలయం,బర్నవపర వన్యప్రాణుల అభయారణ్యం మరియు గందేస్వర్ ఆలయం ఉన్నాయి.

చరిత్ర పేజీల ద్వారా ...

సిర్పూర్ 5 వ శతాబ్దం AD లో ఏర్పడిన ఒక పురాతన పట్టణం. 6 నుండి 10 వ శతాబ్దం వరకు ఒక ప్రధాన బౌద్ధ యాత్రికుల కేంద్రంగా ఉన్నది. అయితే 12 వ శతాబ్దంలో వచ్చిన భూకంపం కారణంగా మొత్తం నగరం విధ్వంసం అయినది. ఇంకా మిగిలి ఉన్న శిధిలాలు దాని గత వైభవాన్ని ప్రదర్శిస్తాయి.

సిర్పూర్ చేరుకోవడం ఎలా

సిర్పూర్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసందానము కలిగి ఉన్నది. సమీప విమానాశ్రయం రాయ్పూర్ లో ఉంది.

Please Wait while comments are loading...