ధంతరి – ప్రకృతి అందంతో అశీర్వదించబడ్డ భూమి!

ధంతరి భారతదేశంలోని పురాతన నగరపాలక ప్రాంతాలలో ఒకటి. ఈ జిల్లా అధికారికంగా 1998 జులై 6 న ఏర్పాటుచేయబడింది. ఈ జిల్లా ఛత్తీస్గడ్ ప్రాంతంలోని సారవంతమైన మైదానంలో ఉంది. ఈ జిల్లా ఉత్తరాన రాయపూర్ జిల్లా, దక్షిణాన కంకేర్, బస్తర్ జిల్లాలు, తూర్పున ఒరిస్సా రాష్ట్రము, పశ్చిమాన దుర్గ్ జిల్లాలతో చుట్టబడి ఉంది. సేందూర్, జోన్, ఖరున్ ఉపనదులు ఉన్న ఈ జిల్లా లో మహానది ప్రధాన నది.

ధంతరి లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

అద్భుతమైన సహజ అందంతో ఆశీర్వదించబడిన ఈ ప్రదేశం అడవి జంతువుల అనేక రిజర్వ్ లను కలిగి ఉంది, ధంతరి ఈ ప్రాంతానికి ప్రత్యేకతను జోడించే సాంప్రదాయ గ్రామీణ సంస్కృతికి పేరుగాంచింది. ధంతరి అనేక పర్యాటక ఆకర్షణలను కలిగి ఉంది. గంగ్రెల్ డాం అని కూడా పిలువబడే ప్రసిద్ధ రవిశంకర్ నీటి డాం, సూర్యాస్తమయానికి ప్రసిద్ది చెందిన ఈ ప్రదేశం ప్రతి ఏటా అనేకమంది విహార ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం ప్రత్యేకంగా వర్షాకాల సమయంలో ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. వర్షాకాలంలో ఈ డాం నీటితో నిండి ఉంది, డాం పై నుండి నీరు కిందకు పడుతూ ఉంటుంది. టైగర్ రిజర్వ్ సితనది వన్యప్రాణుల అభయారణ్యం కూడా ప్రసిద్దిచెందిన పర్యాటక ఆకర్షణ. సిహవ పహాడ్ అని ప్రసిద్ది గాంచిన సత్పుర పర్వత శ్రేణులు కూడా ప్రధాన పర్యాటక ఆకర్షణ. దుర్గామాత కు అంకితం చేయబడి పూజించబడుతున్న బిలాయ్ మాత ఆలయం కూడా పర్యాటకుల సందర్శనకు సిఫార్సుచేయబడింది.

ధంతరి – కళలు, సంస్కృతి

ధంతరి పట్టణం కళలు, సంస్కృతి కి గొప్ప విలువను సంతరించుకుంది. ధంతరి లోని అనేకమంది ప్రజలు అనుసరించే కళలకు, సంస్కృతికి నమ్మకమైన వింధ్యవాసిని, అంగర్మోటి ఆలయాలకు ప్రసిద్ది చెందింది. అద్భుతమైన భూభాగం మధ్యలో ఉన్న ధంతరి, ధంతరి లోని ప్రజల సృజనాత్మక ఊహ, సాంకేతిక నైపుణ్యం, కళాత్మక సమర్ధతను ప్రతిబింబించే భారీ గంభీరమైన నిర్మాణాలతో అద్భుతమైన కళాత్మక భవనాలతో ఎత్తులో నిలబడి ఉంది.

ధంతరి సందర్శనకు ఉత్తమ సమయం

ధంతరి పట్టణం వేసవి, శీతాకాలం, వర్షాకాల సాధారణ సీజన్లతో ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంది. శీతాకాలంలో ధంతరి పట్టణాన్ని సందర్శించడం ఉత్తమ౦.

ధంతరి చేరుకోవడం ఎలా

ధంతరి రైలు, రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు బాగా కలుపబడి ఉంది. ఈ నగరం రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

 

Please Wait while comments are loading...