మొట్టమొదటగా ఈ పాటియాలా రాజులు వేటాడేందుకు ఈ చైల్ వైల్డ్ లైఫ్ సాంచురీని కేంద్రంగాఎంచుకున్నారు. ఆ తరువాత 1976 లో ప్రభుత్వంచే ఈ ప్రాంతం వైల్డ్ లైఫ్ సాంచురీగా ప్రకటించబడింది. 110 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన ఈ సాంచురీ పర్వతం పైన ఉంది. ఈ సాంచురీ చుట్టూ దట్టమైన పైన్ వృక్షాలు, పొదలు, సింధూర వృక్షాలు ఇంకా పచ్చిక భూములు కనిపిస్తాయి.
గోరల్, రీసస్ మకాక్, ఇండియన్ మున్త్జాక్, చిరుత మరియు పింఛం కలిగిన ముళ్ళ పంది వంటి అనేకమైన జంతు జాతులకు ఈ సాంచురీ స్థావరం. అంతే కాకుండా, పాంథర్(నల్ల జుట్టు గల చిరుత పులి), అడవి పంది, సాంబార్, యూరోపియన్ రెడ్ డీర్, హిమాలయన్ బ్లాక్ బీర్, కామన్ లంగూర్ మరియు బ్లాక్ నేప్డ్ హేర్ వంటివి కూడా ఇక్కడ కనిపిస్తాయి. చీర్ ఫీసంట్ మైర్యు కలీజ్ ఫీసంట్ వంటి విభిన్న పక్షి జాతులని కూడా ఈ చైల్ వైల్డ్ లైఫ్ సాంచురీలో గమనించవచ్చు. ఈ సాంచురీ యొక్క బర్డ్స్ ఐ వ్యూ ని అందించే మకన్స్ అనబడే ఎన్నో వీక్షణ కేంద్రాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.