చైల్ - అందమైన పర్వత ప్రాంతం

సముద్ర మట్టం నుండి 2226 మీటర్ల ఎత్తులో ఉన్న చైల్ హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సాద్ టిబా కొండ పైన నెలకొని ఉన్న అందమైన పర్వత ప్రాంతం. చారిత్రాత్మకంగా లార్డ్ కిచేనేర్ యొక్క ఆదేశాలను అనుసరిస్తూ షిమ్లా నుండి బహిష్కరింపబడ్డ అప్పటి పాటియాలా రాజు అయిన మహారాజా అధిరాజ్ భూపిందర్ సింగ్యొక్క వేసవి రాజధానిగా ఈ ప్రాంతం వ్యవహరించిందని చెప్పుకోవాలి. ప్రతీకారచర్యగా మహారాజా భూపిందర్ సింగ్ వారు చైల్ ని వేసవి రాజధానిగా ఎంచుకుని చైల్ పాలసు ని ఇక్కడ నిర్మించారు.

1891 లో నిర్మించబడిన చైల్ పాలస్, చైల్ యొక్క రాచరిక వారసత్వానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ప్రాంతం లో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ చైల్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఈ ప్రాంతం లో ఉన్న స్వదేశీ వృక్ష మరియు జంతు జాలాలను గమనించే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇండియన్ మున్త్జాక్, చిరుత, పింఛం గల ముళ్ళపంది, నల్ల జుట్టు గల చిరుతపులి, అడవి పంది, గోరల్, సాంబార్ మరియు యురోపియన్ రెడ్ డీర్ లు ఈ సాంచురీ లో కనిపించే జాతులు. చైల్ లో ని క్రికెట్ ఇంకా పోలో గ్రౌండ్ లు సముద్ర మట్టంనుండి 2444 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మొత్తం మీద ఎత్తైన క్రికెట్ వేదిక ఇది. చైల్ మిలిటరీ స్కూల్ వారి నిర్వహణలో ఉన్నాయి.

గురుద్వారా సాహిబ్, కలి కా టిబ్బా మరియు మహారాజా పాలసులు ఈ ప్రాంతంలో ఉన్న మరికొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. కాలి బాట ప్రయాణీకుల యొక్క స్వర్గంగా పరిగణించబడే ఈ ప్రాంతం ట్రెక్కింగ్ మరియు ఫిషింగ్ లకి అనువైనది.

వాయు, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చైల్ కి సులభంగా చేరుకోవచ్చు. మార్చ్ లో మొదలయ్యి మే వరకు కొనసాగే ఎండాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్ల పర్యాటకులు శీతాకాలంలో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

Please Wait while comments are loading...