ఫియరా తూయ్ అనేది ఒక పవిత్ర నీటి బుగ్గ. దీని నీరు చాలా తియ్యగా వుంటుంది. ఈ ప్రదేశం చంఫాయి కి 65 కి. మీ. ల దూరం లో కలదు. దీనిని గురుంచి అనేక మిజో గ్రందాల లో కలదు. ఈ నీటికి కొన్ని మహత్యాలు వున్నాయని భావిస్తారు. ఇక్కడి సమీప విలేజ్ లో ఒక యువకుడు ఉండేవాడని అతను చాలా సిగ్గరి అవటంతో బయటకు వచ్చి అందరి తో కలసి నీటికి వచ్చేవాడు కాదని, చివరకు అతడు ఒక రాయి కింద పారే ఈ నీటిని కనుగొన్నాడని చెపుతారు. ఈ ప్రదేశానికి చేరాలంటే, ఐజవాల్ నుండి ఫరకవాన్ విలేజ్ వెళ్ళే బస్సు లో ప్రయాణించి మూడు గంటల సమయంలో చేరవచ్చు. విలేజ్ సమీపం లోనే ఈ నీటి బుగ్గ వుంటుంది.



Click it and Unblock the Notifications