లామ్సియాల్ ఫూక్ అనేది ఒక గుహ. ఇది ఫరక్వాన్ విలేజ్ సమీపం లో చంఫాయి జిల్లా లో కలదు. ఈ ప్రదేశం లో ఒకప్పుడు ఇక్కడ కల రెండు గ్రామాల మధ్య భూమి కొరకు పెద్ద పోరాటాలు జరిగాయి. అపుడు ఈ కొండ గుహలో వారు కొన్ని ఆయుధాలు నిలువ చేసారు. ఆ పోరాటంలో మరణించిన యోధుల ఆస్థి పంజరాలు గుట్టలుగా బయట పడ్డాయి. నేటికి వాటికి సంబంధించిన అవశేషాలను ఇక్కడ భద్రపరచారు.
ఈ గుహ మిజోల ధైర్య సాహసాలకు ప్రతీకగా యుద్ధ పోరాట నాశానాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ గుహ చీరాలంటే, ఐజవాల్ నుండి ఫర్కవాన్ వెళ్ళే బస్సు లో సుమారు వంద కి. మీ. లు ప్రయాణించి చేరవచ్చు. లేదా లేన్గుయి ఎయిర్ పోర్ట్ కు చేరి అక్కడ నుండి కూడా చేరవచ్చు. ఇండియా లోని ప్రధాన నగరాల నుండి ఐజవాల్ లోని లేన్గుయి ఎయిర్ పోర్ట్ కు విమాన సర్వీస్ లు కలవు.



Click it and Unblock the Notifications