మంగ ఖాయి లూంగ్ అనేది ఒక పెద్ద సిల . దీనిపై అనేక మానవ చిత్రాలు చెక్కబడి వుంటాయి. ఈ చిత్రాలు చని పోయిన వారి పోషకులు గా చెపుతారు. సమీపంలో అనేక చిన్న రాలు కలవు. వీటిపై మిథున్ అనే జంతువు ల బొమ్మలు చెక్కబడి వుంటాయి. ఈ బొమ్మలు ఈశాన్య దేశాలలో సాధారణంగా చూపబడతాయి. మంగ ఖాయి లూంగ్ అయిదు మీటర్ల ఎత్తు వుంటుంది. దీనిని క్రి. శ. 1700 లలో మంగ ఖాయి అనే పేరు కల రాల్తే తెగ నాయకుని స్మారకార్ధం నిర్మించారు. మంగ ఖాయి లూంగ్ మిజోరం లోని చంఫాయి జిల్లా లో ఐజవాల్ నుండి 194 కి. మీ. ల దూరం లో కలదు.



Click it and Unblock the Notifications