మిజోరం లో ముర్లేన్ నేషనల్ పార్క్ ప్రసిద్ధి. సుమారు 200 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వుంటుంది. ఇండో మయన్మార్ బోర్డర్ కు దగ్గర. ముర్లేన్ నేషనల్ పార్క్ లో అనేక రకాల పక్షులు కలవు. అటవీ జంతువులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఒక పెద్ద గుహ కలదు. అనేక చిన్న నదులు, కొలనులు, కూడా ఈ పార్క్ కలిగి అక్కడి జన్థువులకుఇ నీటి అవసరాలను తీరుస్తుంది. ఈ పార్క్ అమెజాన్ పార్క్ అంత దట్టంగా వుంటుంది. ఒక్క శాతం సూర్య కిరణాలు కూడా పాడనీ దట్టమైన చెట్ల ప్రాంతాలు కలవు. ఈ కారణంగా దీనిని ' వెళితే తిరిగి రాలేని ' ప్రదేశం అని కూడా అంటారు.
ఈ పార్క్ లో 15 రకాల జంతు తెగలు, 150 రకాల పక్షులు, 35 రకాల ఔషధ మొక్కలు, నాలుగు జాతుల తోటలు కలవు. ముర్లేన్ పార్క్ కు 245 కి. మీ.ల దూరం లో కల ఐజావాల్ నుండి ప్రైవేటు వాహనాల లో చేరవచ్చు.



Click it and Unblock the Notifications