ఈ ప్రదేశంలో బిచికీలియా జలపాతాలు పర్యాటకులకు మంచి ఆకర్షణ. గల గల పారే ఈ జలపాతాలు ఎంతో దూరం నుండే పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశం, సిటీకి 11 కి.మీ.ల దూరంలో వుంటుంది. చాత్రా పడమటి భాగంలో నిరంజన నది ఒడ్డున ఈ జలపాతాలు కలవు.
బిచికీలియా ప్రదేశం ప్రకృతి ప్రియులకే కాదు, సాహసికులకు కూడా ఎంతో ఆకర్షణగా వుంటుంది. కొండపైకి ట్రెక్కింగ్ లేదా నడకలో అద్భుత సుందర ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆనందంగా సాగిపోవచ్చు.