దంతేవాడ - ప్రశాంత పట్టణం !

దంతేవాడ ప్రశాంతమైన ఒక చిన్న పట్టణం. ఇది చత్తీస్ ఘర్ లోని బస్తర్ ప్రాంతంలో దంతేవాడ జిల్లా లో కలదు. ఈ టవున్ ఒకప్పుడు రాజ్య పాలనకు రాజధాని నగరంగా వుండేది.

దంతేవాడ లోను చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

అనేక సుందర దృశ్యాల తోని, కొండల వరుసల తోను, దంతేవాడ ఒక అందమైన ప్రదేశం. చారిత్రకంగా ప్రసిద్ధి గాంచిన ఈ పట్టణం లో అనేక టెంపుల్స్ కూడా కలవు. ఈ టవున్ కు అక్కడ కల దేవత దంతేస్వరి పేరు వచ్చింది. దంతేస్వరి టెంపుల్ తో పాటు ఇక్కడ బైలడిలా, బర్సూర్, బిజాపూర్, గమవాడ మెమరీ స్తంభాలు, బీజాపూర్ మరియు బోధ ఘాట్ సాత్ దార్ లు కూడా ఆకర్షణీయ ప్రదేశాలే.

దంతేవాడ సంస్కృతి

ఇక్కడి స్థానికులు మురియ మరియు దండామి మరియా తెగలకు చెందినవారు. ఈ టవున్ ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా లు చుట్టూ కల జిల్లాలో ఉన్నప్పటికీ ఇక్కడి నివాసులు వారి సంస్కృతి ని నేటికి కాపాడుకుంటూ వారసత్వాన్ని కలిగి వున్నారు.

ఇక్కడి ప్రజలు ప్రధానంగా మాంసాహారులు, తక్కువ దుస్తులు ధరిస్తారు. మహిళలు రాళ్ళ మరియు ఇతర ప్రాకృతిక వస్తువులతో చేసిన ఆభరణాలు ధరిస్తారు. ఇక్కడి ప్రజలు, అన్ని ప్రధాన పండుగలు హోలీ, దసరా వంటివి ఆచరిస్తారు.

ఎలా చేరాలి ?

దంతేవాడ రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి వుంది. సమీప ఎయిర్ పోర్ట్ రాయ్ పూర్ లో కలదు.

Please Wait while comments are loading...