ఇక్కడకల టీ మరియు సుగంధ ద్రవ్యాల తోటలు దేవి కులాన్ని పర్యాటకులు తప్పక చూసేవిలా చేస్తాయి. వివిధ రకాల మొక్కలు, కీటకాలు కనపడతాయి. ఈ తోటలలో టీ మరియు సుగంధ ద్రవ్యాల మొక్కలతోపాటు వివిధ రకాల ఇతర చెట్లు కూడా పెంచుతారు. సుగంధ ద్రవ్యాల మొక్కల సువాసనలు మత్తెక్కిస్తాయి.
కొన్ని అరుదైన మొక్కలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఎరుపు మరియు నీలిరంగు బంక చెట్లు, దేవికులం కొండలపై అమితంగా ఉంటాయి. తోటల విహారం పర్యాటకులకు మంచి ఉత్తేజాన్నిస్తుంది. చెట్ల వరుసలు కన్నులకింపుగా ఉంటాయి. చక్కగా కత్తిరించిన టీ, మిరియం, లవంగం, యాలక మొక్కలు మంచి సువాసనలనిస్తాయి.
ఒక గైడ్ మార్గదర్శకతతో మీ అనుభవాలను రెట్టింపు చేసుకోవచ్చు. తోటల వద్దే మీరు తాజా ఆకులతో తయారు చేసిన ఒక్క కాఫీ లేదా టీ తాగేస్తే, దాని రుచికి అన్నీ మరచి అద్భుతం అనాల్సిందే. 420