సముద్ర మట్టం నుండి 8300 అడుగుల ఎత్తులో ఉన్న సాహసోపేతమైన క్యాంపు ఈ థంగ్ధర్ క్యాంపు. ఇది ప్రధాన మార్కెట్ నుండి 14 కిలోమీటర్ల దూరం లో ఉంది. వసతి సదుపాయం తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ఈ థంగ్ధన్ క్యాంపు లో పర్యాటకులు ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్, హైకింగ్, ట్రెక్కింగ్, జిగ్ జాగ్ బార్స్, కమెండో నెట్ వంటి వివిధ క్రీడలు సాహసోపేతమైన కార్యక్రమాలంటే ఇష్టపడే పర్యాటకులని ఆకట్టుకుంటాయి. వీటితోపాటు మినీ గోల్ఫ్, సాఫ్ట్ బాల్ క్రికెట్, బాడ్మింటన్, మినీ బాస్కెట్ బాల్ వంటివి అవుట్ డోర్ గేమ్స్ ని కూడా ఆడే సదుపాయం కలదు. సమీప ప్రాంతాల సైట్ సీయింగ్ ని కూడా ఈ క్యాంపు నిర్వహిస్తుంది. స్టార్ గాజేర్స్ అలాగే పక్షి ప్రేమికులకి ఈ ప్రాంతం అనువైనది.



Click it and Unblock the Notifications