వాయుమార్గం ద్వారా ధన్ బాద్ లో స్వంత విమానాశ్రయం లేదు. బర్వడ్డ సమీపంలో ఇది ప్రణాళిక చేయబడింది. ఈ నగరానికి సమీపంలో కొన్ని విమానాశ్రయాలు ఉన్నాయి. ధన్బాద్, రాంచి లోని బిర్స ముండ విమానాశ్రయం నుండి 175 కిలోమీటర్లు, గయా విమానాశ్రయం నుండి 215 కిలోమీటర్లు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 269 కిలోమీటర్లు, కోల్కతా, పాట్న లోని లోక్ నాయక్ జయప్రకాశ్ విమానాశ్రయం నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది.