నామగ్యాల్మా స్తూపం మెక్లియాడ్ గంజ్ నగరం నడిబొడ్డున వుండే ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ బౌద్ధ నిర్మాణం టిబెట్ స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన యోధుల స్మారకార్ధం నిర్మించారు. మౌర్య చక్రవర్తి అశోకుడు పాలించిన 3 వ శతాబ్దం నాటి నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు. ఈ స్తూపంలో గౌతమ బుద్ధుడి గా పిలువబడే శాక్యముని బుద్ధుడి అందమైన విగ్రహం కూడా ఒక చిన్న గదిలో వుంది. బుద్ధుడిని ప్రార్ధించేందుకు ఇక్కడికి అనేకమంది బౌద్ధులు వస్తారు.



Click it and Unblock the Notifications