నగోవ బీచ్, బుచర్వాడ ఒక ఫిషింగ్ హామ్లెట్ అయిన నగోవ గ్రామం పేరు వొచ్చింది. ఈ బీచ్ కు చేరాలంటే డయ్యు నుండి 20 నిముషాల సమయం పడుతుంది. ఇది వృత్తాకారంలో ఉండి, గుర్రపునాడా ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ బీచ్ ఒక చివర నుండి ఇంకొక చివరి వరకు సుమారుగా 2.5 కిలోమీటర్లు ఉన్నది.
ఈ బీచ్ పూర్తిగా నగరానికి వేరుగా ఉండటంవలన ఇక్కడ నిశబ్ద మరియు ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది. నగర గందరగోళానికి, ఒత్తిడికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఈ బీచ్ లో గడపటం సరిఅయిన పని. నగోవ బీచ్ అద్భుతమైన శుభ్రతతో మరియు మనోహరంగా ఉన్నది. ఇక్కడ రోజంతా సముద్రపు అలల గుసగుసలతో, పాం చెట్ల గాలి వీచికలతో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్,నీటి అలల మీద ఆడుకోమని, నీటిలో ఈత కొడుతూ సమయాన్ని గడపమని సందర్శకులను ఆహ్వానిస్తున్నది. ఈ బీచ్ ఈత మరియు ఇతర జల క్రీడలకు కూడా చాలా సురక్షితం.
ఇక్కడ అధిక సాహసోపేతమైన సెయిలింగ్, బోటింగ్, వాటర్ స్కీయింగ్ లేదా ఇతర ఉత్తేజకరమైన కార్యకలాపాలను చేయవొచ్చు. ఈత వంటివి ఇష్టపడనివారు మెత్తని ఇసుకతిన్నెల మీద సేద తీరవొచ్చు లేదా దట్టమైన పాం చెట్ల నీడన చిన్న కునుకు తీయవొచ్చు.



Click it and Unblock the Notifications