Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుంగార్పూర్ » వాతావరణం

దుంగార్పూర్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: అక్టోబర్, నవంబరు మాసాలలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.  

వేసవి

దుంగార్పూర్ ప్రాంతంలో సంవత్సరం మొత్తమ్మీద వాతావరణం పొడిగా, భరించలేన౦త వేడిగా ఉంటుంది. వేసవి (మార్చ్ నుండి మే వరకు): ఇక్కడ వేసవి మార్చ్ నుండి మొదలై మే వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు, 25 డిగ్రీలుగా నమోదవుతాయి. ఈ సమయంలో దుంగార్పూర్ లో వేడి భరించలేనంతగా ఉంటుంది కాబట్టి పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఇష్టపడరు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ వరకు): వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉంటుంది. ఈ వర్షపాతం భరించలేని వేడినుండి ఉపశమనాన్ని ఇస్తుంది.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు): ఈ ప్రాంతంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలలో అత్యధిక చలిఉండే మాసాలు. ఈ సమయంలో ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలు 0 డిగ్రీలుగా నమోదవుతాయి. శీతాకాలంలో దుంగార్పూర్ వెళ్ళేవారు ఉన్ని దుస్తులు తీసుకెళ్ళవలసిందని సూచించ బడుతోంది.