ఫాగు కుఫ్రి లో కల ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది సముద్ర మట్టానికి 2509 మీ. ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం సిమ్లా నుండి 23 కి. మీ.లు మరియు కుఫ్రి నుండి6 కి. మీ.ల దూరం లో కలదు. ఈ ప్రాంతం లో పర్యాటకులు, అందమైన పర్వత ప్రదేశాలు, పండ్ల తోటలు, అడవులు ఆనందించవచ్చు. ఇక్కడ నుండి గిరి వాలీ అందాలు చూడవచ్చ్.
ఇంతే కాక, ఇక్కడ అందమైన బంతియా దేవత దేవాలయం కలదు. టెంపుల్ గోడలపై చక్కని చెక్కిన చిత్రాలు కలవు. త్రేక్కర్ లకు ప్రకృతి ప్రియులకు ఈ ప్రదేశం ఆనందంగా వుంటుంది. ఇక్కడ ఒక రాత్రి బస సూచించ దగినది. తేయోగ్ ప్రాంత దీప వెలుగులలో హిమాలయ పర్వత శ్రేణులు రాత్రి వేళ ఎంతో అందంగా కనపడతాయి. పర్యాటకులు చాలామంది ఈ ప్రదేశానికి ఫిబ్రవరి నెలలో వింటర్ ఫెస్టివల్ కు వస్తారు.



Click it and Unblock the Notifications