Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫతేనగర్ సాహిబ్ » వాతావరణం

ఫతేనగర్ సాహిబ్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం ఫతే ఘర్ సాహిబ్ సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూల సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

వేసవి

వేసవి ఈ ప్రాంతం లో వేసవి మార్చ్ లో మొదలై మే వరకూ వుంటుంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 45 డిగ్రీలు వుంటుంది. తరచు ఇసుక తుఫానులు కూడా వస్తుంటాయి. పర్యటనకు ఈ సమయం అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం ఫతే ఘర్ సాహిబ్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. వర్షాలు పడి ఉష్ణోగ్రతలు తగ్గి నప్పటికీ తేమ అధికంగా వుంటుంది. ఒక మోస్తరు వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలం ఫతేనగర్ సాహిబ్ లో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. డిసెంబర్ , జనవరి నెలలలో 4 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడి పోతాయి. ఈ సమయం లో సందర్శన కు వెళ్ళేవారు తమ ఉన్ని దుస్తులు తప్పక తీసుకు వెళ్ళాలి.