గంజా౦ జిల్లా ప్రధాన కేంద్రం ఛత్రపూర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వుండే సముద్ర తీరం అర్యపల్లి. ఇక్కడి ఉల్లాసపరిచే వాతావరణం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి సర్వీ చెట్లు తీరాల వెంట దట్టంగా పెరిగి కంటికి ఇంపుగా వుంటాయి. సూర్య రశ్మి సోకగానే బంగారు రంగులోకి మారే ఇసుక తిన్నెలు ఈ ప్రాంతం అందాన్ని ఇనుమడింప చేస్తాయి. ఇసుక తీరాలతో కూడిన ఇక్కడి నీలి సముద్రం ప్రశాంతమైన వాతావరణం అందిస్తుంది, జనం ఇక్కడికి వచ్చి సేద తీరుతారు.
ఇక్కడికి వచ్చే పర్యాటకులు సన్ బేతింగ్ తో పాటు సర్ఫింగ్ కూడా చేస్తారు. సంధ్యా సమయాల్లో సూర్యుడు అస్తమిస్తూ వెన్నెలకు దారిచ్చే తీరు చూసి తీరాల్సిందే. ఆర్యపల్లి వెళ్ళినప్పుడు ఇసుక ఖనిజం ప్రాజెక్ట్ ను తప్పక చూడాలి. అక్టోబర్ నుంచి మార్చ్ మధ్య ఆర్యపల్లి ని సందర్శించడానికి ఉత్తమ సమయం.



Click it and Unblock the Notifications