అతగడ పట్న చత్రపూర్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో వుంది. అతగడ పట్న లో చాలా పెద్ద చారిత్రిక అవశేషాలు వున్నాయి. ఇది కవి సూర్య బలదేవ్ రథ్, కవి జాదూమని మహాపాత్ర లాంటి వారికి పుట్టినిల్లు. అతగడ పట్న ఒకప్పుడు పూరి కి చెందిన గజపతి రాజు కు ఆశ్రయం ఇచ్చింది, కాలాపహాడ్ దాడినుంచి కాపాడడానికి జగన్నాథ దేవాలయంలోని విగ్రహాన్ని దాచింది.
అందువల్ల ఆయన హయాంలో మరికొన్ని దేవాలయాలతో పాటు జగన్నాథ దేవాలయాన్ని ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య నిర్మించాడు. దాడి జరిగిన తరువాత ఈ విగ్రహాన్ని పూరి లో యథా స్థానానికి మార్చేసారు, ఇక్కడ అతగడ పట్న లో గుడి ఖాళీ అయింది. ఈరోజు దాకా ఆ గుడి ఖాళీగానే వుంది. ఈ దేవుడు లేని గుడిలో జగన్నాథ ఆలయానికి సంబంధించిన అన్ని ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ చెక్కు చెందని అసలైన స్థితిలో చూడవచ్చు. ఈ గుడి అత్యద్భుత అందమే ఈ ప్రాంతానికి ప్రధాన పర్యాటక ఆకర్షణ.



Click it and Unblock the Notifications