Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హేమకుండ్

హేమకుండ్ - ప్రార్థనా స్థలం !

13

హేమ కుండ్, ఇది ఒక బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఒక సిక్కుల యొక్క ప్రార్థనా స్థలం. ఇది ఉత్తరాఖండ్ లో ఉన్న చమోలి జిల్లాలో ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 15200 అడుగుల ఎత్తులో ఉన్నది మరియు రిషికేశ్-బద్రీనాథ్ హైవే మీద ఉన్న 'గోబింద్ ఘాట్' నుండి కాలినడకన మాత్రమే ఇక్కడికి చేరుకోగలము. దీనికి ఈ పేరు రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది. హేమ అంటే 'మంచు' అని అర్థం, కుండ్ అంటే 'గిన్నె' అని అర్థం. ఇది ఏడు పర్వతాల మధ్యన నిషాన్ సాహిబ్,ఒక సిఖ్ పవిత్రమైన జెండా తోరణంతో ఉన్నది. ఈ ఏడు శిఖరాగ్రాలు ఉన్న పర్వతాన్ని 'సప్త్ ష్రింగ్' అని పిలుస్తారు. చరిత్ర ప్రకారం, 10వ సిఖ్ గురువు అయిన గురు గోవింద్ సింగ్ జీ ఇక్కడ చాలా సంవత్సరాలు ధ్యానంలో ఉన్నారని చెపుతారు.

ఈ స్థలం, హేమకుండ్ సాహిబ్, గురు గోవింద్ సింగ్ జీకి అంకితం చేయబడిన గురుద్వారాకు చాలా ప్రాచుర్యం పొందింది. గురు గోవింద్ సింగ్ వ్రాసిన 'దసం గ్రంథ్' అనే సిక్కుల పవిత్ర పుస్తకంలో హేమకుండ్ గురించి ప్రస్తావించారు.

ఈ గురుద్వారాను 1960వ సంవత్సరంలో మేజర్ జనరల్ హర్కిరత్ సింగ్ ఆధ్వర్యంలో కట్టించారు. అతను, ఈ కట్టడ నిర్మాణ ప్రక్రియను నిర్వహించటానికి 'ఆర్కిటెక్ట్ సియలి' లో ఎంపిక చేయబడిన ఇంజనీర్-ఇన్-చీఫ్. ఈ గురుద్వారాకు సమీపంలో ఒక అందమైన సరస్సును పర్యాటకులు చూడవొచ్చు. ఈ ప్రాంతాన్ని విపరీతమైన మంచు కారణంగా అక్టోబర్ మరియు ఏప్రిల్ నెలల మధ్యన మూసిఉంచుతారు. ఇక్కడ సిక్కులు 'కర సేవ' మరియు దెబ్బతిన్న మార్గాన్ని బాగు చేయటంలో సహాయం చేస్తుంటారు.

సమయం కుదిరితే పర్యాటకులు ఈ ప్రాంతంలో కల 'లక్ష్మణ్ ఆలయం', దీనినే 'లక్ష్మణ్ గోపాల్' అని కూడా అంటారు; చూడవొచ్చు. ఈ ప్రాంతంలో బద్రీనాథ్ దగ్గరలో గల 'వసుధార జలపాతాలు' ఇంకొక ప్రముఖ ఆకర్షణ. చుట్టూ పర్వతాలతో ఉండి,400 అడుగుల ఎత్తు నుండి నీళ్ళు క్రిందకు పడుతూ చూపరులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ స్థలానికి ట్రెక్కింగ్ ద్వారా 'మన' గ్రామం నుండి బయలుదేరి, 2-3 కి. మీ. సన్నటి దారి గుండా నడవాలి, కాని దీని తరువాత ఈ దారి చాలా నిటారుగా ఉంటుంది.

7817 మీటర్ల ఎత్తులో నిలిఛి ఉన్న నందా దేవీ నేషనల్ పార్క్, హేమకుండ్ సమీపంలో ఉన్న మరొక ప్రముఖ ఆకర్షణ. బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఈ లోయ యొక్క పుష్పాలు, ఈ తోట ఉత్తర-పడమర వైపు ఉన్నాయి. నంద దేవి నేషనల్ పార్క్, వాలీ ఆఫ్ ఫ్లవర్స్ తో కలిసి 'నందా దేవి బయోస్ఫియర్ రిజర్వు' ఏర్పడింది. 5,148.57 కి.మీ. ఒక బఫర్ జోన్ హద్దుగా, దీని మొత్తం స్థలం 2,236.74 కి. మీ.లు కవర్ చేయబడింది.

హేమకుండ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హేమకుండ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హేమకుండ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హేమకుండ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: ప్రయాణికులు రుషికేష్, పూరీ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ్, ఊఖిమథ్, శ్రీనగర్, కోట్ద్వార, డెహ్రాడూన్, హరిద్వార్ మరియు చమోలి ప్రదేశాల నుండి గోవింద్ ఘాట్ కు టాక్సీలు మరియు బస్సుల ద్వారా గాని చేరుకోవొచ్చు. గోవింద్ ఘాట్ నుండి ట్రెక్ ద్వారా 19 కి.మీ. ప్రయాణించి హేమకుండ్ చేరుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా: హేమకుండ్ కు సమీపంలో రిషికేశ్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడనుండి ఇండియాలోని ప్రముఖ నగరాలకు అనేక రైళ్ళు అనుసంధించబడి ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ గోవింద్ ఘాట్ నుండి 273 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ నుండి హేమకుండ్ చేరుకోవటానికి ట్రెక్ ద్వారా 16 కి. మీ. ప్రయాణించవలసి ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ద్వారా: 'జోలి గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఆఫ్ డెహ్రాడున్' విమానాశ్రయం హేమకుండ్ కు దగ్గరలో ఉన్నది. ఇది హేమకుండ్ నుండి 268 కి. మీ. దూరంలో ఉన్నది. విమానాశ్రయం నుండి హేమకుండ్ చేరుకోవటానికి టాక్సీలు మరియు కాబ్లు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue