కేలవరపల్లి డామును తమిళనాడు లోని పోన్నియర్ నది పై సుమారు 13.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ డాం నీరు కడ్లూర్ ,ధర్మపురి,క్రిష్ణగిరి మరియు వెల్లూరు లకు సరఫరా అవుతుంది. ఇది హోసూర్ కు 10 కి.మీ.కల దూరం లో కేలవరపల్లి నుండి బెంగుళూరు వెళ్ళే మార్గం లోకలదు .
హోసూర్ స్థానిక ప్రజలకు, టూరిస్టులకు ఈప్రదేశం వారాంతపు విహారాలకు ఒక మంచి పిక్నిక్ ప్రదేశం. ఈ డాం వద్ద పిల్లల పార్క్ కూడా కలదు. ప్రకృతి ప్రియులకు రణగొణ ధ్వనులు లేని , కాలుష్యం లేని చక్కని ప్రదేశం గాను, పక్షి సందర్సలకు అనేక వలస పక్షులను చూపెదిగాను వుంటుంది. ఇక్కడి రిజర్వాయర్ సమీపం లో కల చిన్న గ్రామం చేనతూర్ లో పక్షుల ధ్వనులు నిరంతరం వినబడుతూనే వుంటాయి.



Click it and Unblock the Notifications