ఈ ఒస్మాన్ సాగర్, గండిపేట్ గా స్థానికులచే పిలవబడుతుంది. ఇది మరి యొక మానవ నిర్మిత చెరువు. మూసీ పైన డ్యాం ని నిర్మించే సమయంలో నిర్మితమైనది ఈ చెరువు. 1920 లో నిర్మిత మైన ఈ చెరువు హైదరాబాద్ కి మరియు చుట్టు పక్కల గ్రామాలకి మంచి నీటి అవసరాలని అప్పటినుండి తీరుస్తున్నాది. అంతే కాక ఈ చెరువు వరదల నుండి ఈ నగరాన్నిరక్షిస్తున్నది. ఉదాహరణకి 1908 లో ని వరదలని చెప్పుకోవచ్చు.
ఆఖరి నిజాం అయిన ఒస్మాన్ అలీ ఖాన్ యొక్క పరిపాలనా కాలంలో ఈ చెరువు నిర్మితమైనది. అయన పేరు మీద ఈ చెరువుని ఒస్మాన్ సాగర్ లేక్ అని పిలుస్తారు. ఈ చెరువు పక్కనున్న రాయల్ గెస్ట్ హౌస్ నుండి చెరువుని ఆసాంతం చూడవచ్చు.ఈ అధ్బుతమైన సాగర్ మహల్ ని నిజాం తన వేసవి విడిదిగా వాడే వారు.
ఈ అద్భుత భవనం ఇప్పుడు చారిత్రక చిహ్నం గానే కాకుండా ఈ చెరువుని అధ్బుతంగా చూపించే ప్రదేశంగా కూడా ఉన్నది. విలాసవంతమైన విడిదిగా ఈ భవనాన్ని ఉపయోగిస్తున్నారు.



Click it and Unblock the Notifications