స్నో వరల్డ్ అనే అమ్యుస్మెంట్ పార్క్ ఈ తరహా పార్క్ ల లో దేశం లోనే మొట్టమొదటిది. 2004 లో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఒక్క రోజు లో 2400 మంది పర్యాటకులు వినోదించవచ్చు.కృత్రిమం గా తయారు చేసిన మంచు ఈ పార్క్ లో కురిపిస్తారు.టన్ను ల కొద్ది మంచు ని పొరలు పొరలుగా నేల ఫై పరిచబడి ఉంటుంది. పర్యాటకులు ఈ మంచు ముద్దలతో ఆడుకోవచ్చు, మంచు మనిషిని నిర్మించవచ్చు.
చిన్నపిల్లలు ఈ మంచు నోట్లో పెట్టుకున్నా,మంచి నీటితో చెయ్యటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఈ పార్క్ లోపలి వెళ్ళే ముందు పర్యాటకులు ఉన్ని వస్త్రాలు ధరించాలి. పార్క్ లో కి వెళ్ళగానే శరీరాన్ని వెచ్చ గా ఉంచటానికి ఓక కప్ వేడి సూప్ ని ఇస్తారు.
పార్క్ లోపల స్నో ట్యూబ్ స్లయిడ్ ,ఐస్-బుమ్పింగ్ కార్స్, ఐస్ స్కేటింగ్ రింక్, స్నో వార్ జోన్ అండ్ స్లెఇఘ్ స్లైడ్స్ వంటి వినోద వసతులు ఉన్నాయి.