Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » ఆకర్షణలు » నిజాం మ్యూజియం

నిజాం మ్యూజియం, హైదరాబాద్

1

చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్ ని సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఈ నిజాం మ్యూజియం. నిజాముల పాలస్ లో ఒక భాగమైన ఈ మ్యుజియం అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇందులో ఎన్నో చిత్రలేఖనాలు, ఆభరణాలు, ఆయుధాలు అలాగే పురాతన శకానికి సంబంధించిన కార్లు వంటివి ప్రదర్శనలో ఉన్నాయి.

నిజాం రాజులు అందుకున్న ఎన్నో జ్ఞాపికలు, వివిధ కానుకలు ఈ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచారు. వెండితో తయారు చేయబడిన హైదరాబాద్ నగరానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచబడినవి. చెక్క మరియు బంగారంతో చేయబడిన సింహాసనం, అత్తరు దాచుకునేందుకు అత్యద్భుతంగా చెక్కబడిన వెండి సీసాలు, వెండితో చెయ్యబడిన కాఫీ కప్పులపై అలంకరించిన వజ్రాలు, చెక్కతో చెయ్యబడిన రైటింగ్ బాక్స్ ఇలాంటివి కొన్ని మ్యూజియం లో ప్రదర్శనకి ఉంచబడిన అత్యద్భుతమైన వస్తువులు.

వజ్రాలతో పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, వెండితో తాయారు చేసిన ఏనుగు, మావటి వాడి శిల్పం వంటివి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే కళాఖండాలు. రోల్స్ రాయ్స్ అలాగే జాగ్వర్ మార్క్ వి కారులు కూడా ప్రదర్శనలో ఉంచబడినవి. ఈ కారులు పాతకాలపు కార్లని ఇష్టపడే వారిని అమితంగా ఆకర్షిస్తున్నాయి.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri