సందర్శనకు మంచి సమయం ఇటార్సి సందర్శనకు వింటర్ సీజన్ అనుకూల సమయం
వేసవి ఇటార్సి లో వేసవి మార్చ్ లో మొదలై మే నెల చివరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుండి 47 డిగ్రీల వరకూ చేరతాయి. మే నెలలో అధిక ఉష్ణోగ్రత వుంటుంది.
వర్షాకాలం ఇటార్సి లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. వర్షాలు పడితే ఉష్ణోగ్రతలు తగ్గి కొంత ఊరట కలుగుతుంది. వర్షాలు అధికంగానే పడతాయి. అక్టోబర్ , నవంబర్ నెలలు లో ఉష్ణోగ్రత మరింత తగ్గి సౌకర్యంగా వుంటుంది.
వింటర్ వింటర్ సీజన్ నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఈ కాలం లో ఉష్ణోగ్రతలు కనిష్టం 9 డిగ్రీలు గాను గరిష్టం 24 డిగ్రీలు గాను వుంటుంది. ఇటార్సి సందర్శనకు ఆహ్లాదకరమైన వింటర్ సీజన్ అనుకూలమైనది.