బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బోర్ఘాట్ ఆలయం, జయంతియా హిల్స్ లోని బోర్ఘాట్ గ్రామంలో ఉంది. 1880 వరకు ఇది సరైన రూపంలో ఉన్నప్పటికీ, 1897 భూకంపం తరువాత దాని పునాదులు కలిగిపోయి ఇప్పుడు శిధిలావస్థలో ఉంది. అయితే ఇది ఇలా ఉన్నప్పటికీ ధార్మిక పర్యాటకులు సందర్శించడం మానుకోలేదు. నిజానికి, దీని పడిపోయిన అందమే దీని రహస్య సౌరభం.
ఇది ప్రధానంగా శివునికి అంకితం చేసిన హిందూ దేవాలయం. దీని అంతర్భాగాలు కాల్చిన ఇటుకలతో తయారుచేసారు. దీని చుట్టూ ఉన్న ఇటుక గోడ పొడవు 100 మీటర్లు, వెడల్పు 70 మీటర్లు కలిగిఉంది.
పాతకాలంలో, జయంతియా రాజులు జంతు బాలులను ప్రదర్శించేవారు. అయితే, ఇది ఇకపై ఆచరణలో లేదు. సాధారణ సందర్శకులు ఇక్కడ ప్రార్ధనలు చేస్తారు, కొన్ని సార్లు పూజలు నిర్వహిస్తారు.
లాడ్ ర్యమ్బై బతవ్- బోర్ఘాట్ రోడ్డు మీదుగా అద్దె కాబ్ లలో ఈ ఆలయాన్ని సందర్శించడం ఉత్తమం.



Click it and Unblock the Notifications