అందమైన, కొండ ప్రాంతం లో కల తెల్కో కాలనీ లో హడ్కో లేక్ కలదు. నగరంలోనే ప్రకృతి కోరే వారికి ఈ ప్రదేశం అనువైనది. లేక్ పక్కనే కల ఒక కొండను సుందరమైన సుమంత్ మూల్గావ్ కర్ పార్క్ గా రూపొందించారు. ఇక్కడ కల స్టీల్ పరిశ్రమ ప్రదేశం, మరియు టాటా ఇంజనీరింగ్, లఫర్గే సిమెంట్, టాటా పవర్స్ లను ఈ కొండపై నుండి చూడవచ్చు. పై నుండి చూస్తె, స్టీల్ సిటీ అయిన జంషెడ్ పూర్ ను గ్రీన్ సిటీ అని ఎందుకు చెపుతారో అర్ధం అవుతుంది. లేక్ చుట్టూ కల సుందర కొండ ప్రాంతాలు ఇక్కడనుండి అద్భుతంగా కనపడతాయి. సాయంత్రపు, వీక్ ఎండ్ విహారాలు ఇక్కడ ఆనందకరంగా వుంటాయి.



Click it and Unblock the Notifications