శ్రీకాళహస్తి లోని దుర్గా దేవి గుడి శక్తి రూపమైన అమ్మవారి దేవాలయం. ప్రతి ఏటా వేలాదిమంది భక్తులను ఆకర్షించే ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కాలహస్తీస్వర దేవాలయానికి ఉత్తరాన 800 మీటర్ల ఎత్తున ఒక చిన్న కొండ మీద ఈ గుడిని నిర్మించారు. వెడల్పాటి మెట్లు వుండడం వల్ల ఈ గుడికి చేరుకోవడం తేలికగానే వుంటుంది.
శ్రీకాళహస్తి లోని ఇతర దేవాలయాలతో పోలిస్తే ఈ దుర్గా దేవి గుడి చాలా చిన్నదే అయినప్పటికీ స్థానికులు, పర్యాటకులు కూడా చాలా భక్తితో ఇక్కడికి వస్తారు. ఈ వూరికి వచ్చేవారు తమ యాత్ర ముగిసేలోగా ఈ దేవతను దర్శించుకుంటారు. ఈ గుడి పరిసరాల్లో వుండే పవిత్రత, ప్రశాంతత వల్ల చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ గుడి వున్న కొండ నుంచి ప్రకృతి కడు రమణీయంగా కనబడడం కూడా ఈ గుడిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాయి.