Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరంజియా » వాతావరణం

కరంజియా వాతావరణం

కరంజియా వాతావరణం శీతాకాలం ఖచ్చితంగా సరైన కాలం. అక్టోబర్, మార్చ్ మధ్య పర్యటన అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో జరిగే పండుగలు, వేడుకలు కూడా దీనిని మరో ప్రయోజనం. సందర్శకులు తగినంత వెచ్చని దుస్తులు తీసుకెళ్లాలని సిఫార్సుచేయబడింది.

వేసవి

వేసవి మార్చ్ లో ప్రారంభమై జూన్ చివరి వరకు ఉండే వేసవి చాలా వేడిగా ఉంటుంది. మే అత్యంత వేడిగా ఉండే మాసం. వేసవిలో కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉంటె, గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదౌతుంది. రోజంతా వీచే వేడిగాలుల వల్ల జీవించడం అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో పర్యటన అనుకూలమైనది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం కరంజియా లో ఒక మోస్తరు వర్షపాతం ఉంటుంది. వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలం స్థానిక ప్రజలకు ఎండవేడిమి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎత్తు ప్రదేశంలో ఉండడం వల్ల, కరంజియా లో ఈ సమయంలో ధారాపాతంగా వర్షాలు పడతాయి. ఈ సమయంలో సమీప ప్రాంతాలలో వచ్చే తుఫానుల వల్ల పర్యటనకు సమస్యగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం సాధారణంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రతతో, చల్లగా ఉంటుంది. శీతాకాలం అక్టోబర్ ప్రారంభం నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. పగలు చల్లగా ఉండి, రాత్రులు చలిగా ఉంటాయి.